kcr: పెద్దనోట్ల రద్దుతో భవిష్యత్‌లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి: సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పెద్దనోట్ల రద్దుపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తమ సర్కారు పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చిందని చెప్పారు. ఇది దేశానికి మంచి పరిణామమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు నామమాత్రమేనని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు భవిష్యత్‌లో అద్భుతంగా ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.