: వారిద్దరి మధ్య స్నేహం చెడటానికి నేను కారణం కాదు: కత్రినా కైఫ్


తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ల మధ్య ఉన్న స్నేహం చెడిపోవడానికి తాను కారణం కాదని బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ చెప్పింది. వాస్తవానికి రణబీర్, ఆదిత్యలు మంచి స్నేహితులు. కత్రినా వల్లే వారిద్దరూ దూరమయ్యారనేది బీటౌన్ టాక్. దీంతో, కత్రినా స్పందించి తన తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.

వివరాల్లోకి వెళ్తే, రణబీర్ కు కత్రినా గుడ్ బై చెప్పే సమయంలోనే ఆదిత్య రాయ్ తో 'ఫితూర్' సినిమా చేస్తోంది కత్రినా. అప్పట్నుంచి ఆదిత్యతో కత్రినా క్లోజ్ గా ఉంటోందని... వారిద్దరూ కలసి డ్రీమ్ టూర్ కూడా చేశారనే వదంతులు ఉన్నాయి. కేవలం కత్రినా కారణంగానే మంచి స్నేహితులిద్దరూ దూరమయ్యారని అంటున్నారు. కొద్ది రోజు క్రితం రణబీర్ ఇచ్చిన పార్టీకి కూడా ఆదిత్య డుమ్మా కొట్టాడని... అదే సమయంలో కత్రినాతో గడిపాడని బాలీవుడ్ టాక్. దీంతో స్నేహితులిద్దరికీ మనస్పర్థలు వచ్చాయిని అనుకుంటున్నారు. అయితే, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని కత్రినా చెప్పడంతో... ఇప్పటికైనా ఈ రూమర్లకు తెరపడుతుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News