: మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి: సుబ్రహ్మణ్యస్వామి
పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. కోల్ కతాలోని బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ విద్యార్థి విభాగం ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. మమత ప్రభుత్వంలో చట్టాలు అమలు కావడం లేదని స్వామి ఆరోపించారు. చట్టాలు సరిగా అమలయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని... లేదా ఆర్టికల్ 256 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. విధ్వంసానికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.