: ధోనీని పొగడ్తలతో ముంచెత్తిన కపిల్, హర్షాభోగ్లే
పరిమిత ఓవర్ల క్రికెట్, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. ధోనీ నిర్ణయంతో షాక్‌కు గురైన అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ధోనీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఫొటోలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ధోనీ లాంటి కెప్టెన్ మరొకరు లేరంటూ ప్రశంసలు కురిపించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అయితే భారత్ క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలను ప్రస్తుతించాడు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించి క్రికెట్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్లాడని కొనియాడాడు. 'థ్యాంక్యూ ధోనీ సాబ్' అని పేర్కొన్నాడు. మాజీ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ధోనీని ఆకాశానికి ఎత్తేశాడు. ధోనీ నాయకత్వంలో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందాయని పేర్కొన్నాడు. ధోనీని ప్రతి ఒక్కరు అభినందించాలన్న హర్ష 2019 క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని ట్వీట్ చేశాడు.