kusimavathi: 63 ఏళ్లుగా క్రమం తప్పలేదు.. ఆమె ప్రతి రోజూ రెండు కేజీల ఇసుక తింటోంది!


ఆమె పేరు కుసుమావ‌తి.. త‌న‌కు 15 ఏళ్ల వ‌య‌సు ఉన్నప్పుడు ఇసుక‌ను తిన‌డం ప్రారంభించింది.. ప్ర‌తి రోజు రెండు కేజీల ఇసుక తింటోంది. ఇప్పుడు ఆమెకు 78 ఏళ్లు.. ఇప్ప‌టికీ ఇసుక తింటూనే జీవితాన్ని గ‌డుపుతోంది. ఇసుక‌ను తింటుండ‌డం వ‌ల్లే తాను ఇప్ప‌టికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాన‌ని చెబుతోంది. వారణాసికి చెందిన ఈ బామ్మ 63 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి రోజు ఇసుక తింటున్న వైనంపై మీడియాకు ప‌లు వివ‌రాలు చెప్పింది. తాను మొద‌ట‌ ఇసుక తినడం ప్రారంభించినప్పుడు కడుపు నొప్పి వ‌చ్చింద‌ని, అనంత‌రం నొప్పి  తగ్గిపోయిందని చెప్పింది. రోజులో కొంత సమయాన్ని ఇసుక‌ను సేక‌రించడానికే కేటాయిస్తాన‌ని చెప్పింది. ఒక‌వేళ త‌నకు ఇసుక దొరక్కపోతే ఇంటి గోడ పగలగొట్టి అదే తినేస్తాన‌ని పేర్కొంది.

ఆమె తిండిని చూస్తోన్న స్థానికులు ఎంతో ఆశ్చర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా తినడం వల్ల త‌న క‌డుపులో కానీ, నోట్లో కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని ఆ బామ్మ చెప్పింది. త‌న‌ దంతాలతో ఈ వ‌య‌సులోనూ గట్టి రాళ్లను ఎంతో సులువుగా కొరికేస్తానని తెలిపింది. ఇసుక తినడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండబోవ‌ని చెబుతోంది. ఆమె ప్ర‌తిరోజు ఎంతో ఉత్సాహంగా వ్యవసాయ కూలీ ప‌నికి కూడా వెళుతుంది. ప్ర‌తిరోజు ప‌నిచేస్తూనే ఉంటాన‌ని చెప్పింది. తాను ఇప్పటివరకు వైద్యుడిని కూడా కలవలేద‌ని, ఇసుక తింటుండమే త‌న ఆరోగ్య ర‌హ‌స్య‌మ‌ని తెలిపింది. త‌న ఇంట్లో త‌న అల‌వాట్ల‌ను మార్చుకోవాల‌ని చెబుతున్నార‌ని, అయితే తాను ఆ అలవాటు మార్చుకోలేనని స్ప‌ష్టం చేసింది.

  • Loading...

More Telugu News