: మెరిసిన బంగారం... వరుసగా రెండో రోజు పెరిగిన ధర
బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరగడంతో పాటు, దేశీయంగా కూడా కొనుగోళ్లు పుంజుకోవడంతో బంగారం మెరిసింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి 28,550కి చేరింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 40 వేల మార్క్ ను దాటింది. రూ. 650 పెరిగి రూ. 40,250కి చేరింది.