: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 'షోలే' సినిమా చూపిస్తున్నారు!: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిప్ టాప్ గా తయారై 12 గంటలకు అసెంబ్లీకి వచ్చి ఏకపాత్రాభినయంతో షోలే సినిమా చూపిస్తున్నారని టీడీపీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాకుండా బొందలగడ్డల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సుమారు 2300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు. మరణించిన రైతు కుటుంబాలను సీఎం పరామర్శించి, ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు 6 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన సూచించారు.