: జయలలిత పాత్రలో రమ్యకృష్ణ లేదా హేమమాలిని... మూడు భాషల్లో దాసరి 'అమ్మ'!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో జయలలిత పాత్రకు హేమమాలిని లేదా రమ్యకృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీరిద్దరితోనూ దాసరి చర్చలు జరుపుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలనే యోచనలో దాసరి ఉన్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు. దీనికి 'అమ్మ' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశారు. 

  • Loading...

More Telugu News