: లాంగ్ జర్నీ... పలు దేశాలు దాటుకుంటూ లండన్ చేరనున్న చైనా రైలు!


ఖండాంతర ట్రైన్ ను చైనా ప్రారంభించింది. ఆసియా ఖండంలోని చైనా నుంచి యూరోప్ కు ఈ ట్రైన్ ప్రయాణించనుంది. చైనా నుంచి బ్రిటన్‌ కు ఈ గూడ్సు రైలు ప్రయాణం సాగిస్తుంది. ఇది చైనాలోని జిజియాంగ్‌ ప్రావిన్స్‌ లోని యివు అనే హోల్‌ సేల్‌ మార్కెట్‌ పట్టణం నుంచి లండన్‌ చేరుకోనుంది. ఈ క్రమలో ఈ రైలు దాదాపు 7,500 మైళ్ల (12,000 కిలోమీటర్లు) దూరాన్ని 18 రోజులపాటు ప్రయాణించనుంది.

చైనా నుంచి వయా కజకిస్తాన్‌, రష్యా, బెలారస్‌, పోలాండ్‌, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్‌ మీదుగా లండన్‌ చేరుకోనున్న ఈ ట్రైన్ 9 దేశాల్లో ప్రయాణిస్తుంది. గతంలో బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌ తో చైనా చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ రైలు తన ప్రయాణం ప్రారంభించిందని, ఇది తమ రెండు దేశాల మధ్య సరికొత్త అధ్యాయమని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. 

  • Loading...

More Telugu News