: మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చిన కేంద్రం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆయనకు సమన్లు జారీ కాగా... ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్ చేసింది. డిసెంబర్ 30న ఇదే కేసులో మరో ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. 17 వేల కోట్ల రూపాయల మేర వేలాది మందిని రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ మోసం చేసిందనే ఆరోపణలున్నాయి.