: వేదిక ఎందుకు మార్చారో చిరంజీవే చెబుతారు: అల్లు అరవింద్


చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఫంక్షన్ కు అనుమతులు వచ్చాయని చెప్పారు. అయితే, వేదికను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయాన్ని చిరంజీవే వివరిస్తారని తెలిపారు. మరోవైపు, దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News