: ముంబై పేలుళ్ల దోషి 'రైలు రొమాన్స్'... సీరియస్ గా తీసుకున్న ఫడ్నవీస్
ముంబై పేలుళ్ల కేసులో దోషి ముస్తఫా దొస్సా, రైల్లో జరిపిన శృంగారంపై విచారణ మొదలైంది. ఆయన తన భార్యను కలిసేందుకు, ఒంటరిగా గడిపేందుకు అనుమతించిన పోలీసులపై సీరియస్ అయిన సీఎం, తక్షణం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముస్తఫా, ఆయన భార్య సన్నిహితంగా ఉన్న చిత్రాలు సైతం బయటకు రావడంతో, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువేత్తాయి.
గత 14 ఏళ్లుగా జైల్లో వుండి, యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ముస్తఫా (దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు)ను, ఓ కేసులో విచారణ నిమిత్తం పోర్ బందర్ తరలిస్తున్న వేళ, ముంబైలోనే అతని అనుచరులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు వచ్చారని సమాచారం. ఆపై రైలు అహ్మదాబాద్ చేరుకోగా, ఆయన భార్య షబీనా ఖత్రి రైలెక్కారు. ఇద్దరి ఏకాంతానికి పోలీసులు సహకరించారు. తెల్లారేదాకా డోర్ వద్ద మాత్రమే నిలబడ్డ పోలీసులు, రైలు గమ్యాన్ని చేరిన తరువాతనే తిరిగి బోగీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఫడ్నవీస్ ప్రభుత్వం పోలీసులపై చర్యలకు నడుం బిగించింది.