: పుష్కరాలకు వందల కోట్లు... ఆరోగ్యం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వరా?: నిప్పులు చెరిగిన పవన్


పుష్కరాల పేరు చెప్పి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి, నిధుల కొరత సమస్యను చూపిస్తోందని చంద్రబాబు ప్రభుత్వంపై జనసేనాని నిప్పులు చెరిగారు. శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన కిడ్నీ బాధితులతో మాట్లాడిన అనంతరం ప్రసంగించారు.

"మీరు పుష్కరాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టగలరు. లేదంటే కాపిటల్ సిటీ పేరు చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ, ఇక్కడ ఉద్దానంలో వందల మంది చనిపోయి, పిల్లలు అనాధలవుతుంటే, మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. చాలా చాలా బాధ కలిగిస్తోంది. రాష్ట్రం విడిపోతున్నప్పుడు, ఈ ఉద్దానం, తూర్పు ప్రాంతం నుంచి ఈ సమస్యను ఏ ప్రజా ప్రతినిధి కూడా జాతీయ స్థాయిలో దృష్టికి తీసుకురాలేదు.

ఎంతసేపూ ఆంధ్రా అంటే... ఆ సమస్యలు, ఈ సమస్యలు అంటూ మాట్లాడతారే గానీ, మన తూర్పు ఆంధ్ర ఇంత వెనుకబడిపోయింది. జబ్బుల బారిన పడి, మనుషులు చనిపోతూ, పిల్లలు అనాధలవుతున్నా, పార్లమెంటు స్థాయిలో మాట్లాడకపోవడం నిజంగా... దురదృష్టకరం. ప్రజల తరఫున మాట్లాడటం లేదు. మీరు దీన్ని నిర్లక్ష్యం చేయడాన్ని జనసేన ఖండిస్తోంది" అని అన్నారు.

  • Loading...

More Telugu News