: పార్లమెంటులో చెప్పినా పట్టించుకోలేదా? ఇప్పుడే వింటున్నాను... ఎందుకిలా?: పవన్ కల్యాణ్ ప్రశ్న


శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన పలువురు డాక్టర్లు, విద్యావేత్తలు కిడ్నీ సమస్యల గురించి పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లినా, కారణాలపై రీసెర్చ్ చేసేందుకు రూ. 20 కోట్లను కూడా కేటాయించలేకపోయారని తెలుసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తానీ విషయాన్ని ఇప్పుడే వింటున్నానని, ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించారు. అనేక విధాలుగా పార్లమెంటుకు వెళ్లి సమస్యను తెలిపినా, ముందడుగు పడలేదని ఆరోపించారు. ప్రజలను ఓటు బ్యాంకుగా చూసి, ఓట్లేయించుకుని వెళ్లిపోకుండా, నిజమైన ప్రజా ప్రతినిధులుగా రాజకీయ నేతలు వ్యవహరించాలని జనసేన తరపున తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అన్ని పార్టీలూ సమస్య పరిష్కారంపై దృష్టిని పెట్టాలని చెప్పారు.

  • Loading...

More Telugu News