: దావూద్ ఇబ్రహీం ఫోన్ చేసి బెదిరించాడంటూ ఫిర్యాదు చేసిన చిత్ర నిర్మాతలు


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమకు ఫోన్ చేసి పలుమార్లు బెదిరించాడంటూ  చిత్ర నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, తాము తీస్తున్న సినిమాల విషయమై పాకిస్థాన్ మొబైల్ ఫోన్ నంబరు నుంచి బెదిరింపులకు పాల్పడుతూ, గత పదిరోజుల్లో ఐదుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని  చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

  • Loading...

More Telugu News