: సౌరమండలంలో కంటె పెద్ద గ్రహాలూ ఉన్నాయ్
సౌరకుటుంబంలో ఉండే గ్రహాల్లో గురు గ్రహం అన్నిటికంటె పెద్దది. అయితే ఈ సౌరకుటుంబానికి వెలుపల గురువు (బృహస్పతి) కంటె అతి పెద్దవైన రెండు గ్రహాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీటిలో ఒకటి మన గురు గ్రహానికంటె చాలా పెద్దది. రెండోది పరిమాణంలో గురు గ్రహం అంతే ఉన్నప్పటికీ... ద్రవ్యరాశి పరంగా దాన్ని మించిపోతోంది అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ రెండు గ్రహాలకు పేర్లు కూడా పెట్టారు. గురు గ్రహం తో సమానంగా ఉన్న దానికి కేఓఐ 200బి అని, గురు గ్రహం కంటె పెద్దదిగా ఉన్న గ్రహానికి కేఓఐ 889 అని పేరు పెట్టారు. సౌరకుటుంబం వెలుపల ఇప్పటిదాకా మొత్తం 850 పైచిలుకు గ్రహాలను గుర్తిస్తే ఈ రెండే అతి పెద్దవని ఖగోళవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు గ్రహాలను అంతరిక్షంలోని కెప్లెర్ టెలిస్కోపు, సోఫీ, హార్ప్స్ఎన్ స్పెక్ట్రోగ్రాఫ్స్ సహాయంతో కనుగొన్నారు. ఈ పెద్ద గ్రహాలు తమ తమ నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే కక్ష్య కూడా అస్థిరంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.