: నిప్పులు చిమ్ముతూ ఎగిరిన ఫ్లైయింగ్ సాసర్ ను చూశాం: బ్రిటన్ సంగీతకారుడు
నిప్పులు చిమ్ముతూ ఆకాశంలో దూసుకుపోతున్న ఎగిరే పళ్లాన్ని(ఫ్లైయింగ్ సాసర్) డెవొన్ లోని ఎక్స్ మౌత్ లో స్నేహితుడితో కలిసి తాను చూశానని బ్రిటన్ సంగీత కారుడు మార్క్ ఎమ్మిన్స్ తెలిపాడు. డేవొన్ లో ఆకాశంలో కనిపిస్తున్న ఓ వింత వస్తువును తన స్నేహితుడు ఓస్బర్న్ తో కలిసి గమనిస్తుండగా, అకస్మాత్తుగా అది నిప్పులు చిమ్ముతూ మాయమైందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆకాశంలో అది సుమారు మూడు గంటలపాటు స్థిరంగా ఉందని ఆయన చెప్పారు. తొలుత ఆది తెల్లని కాంతిలా కనిపించిందని, ఆ తరువాత ఆ తెలుపు రంగు డార్క్ గా మారుతూ కనిపించిందని ఆయన అందులో పేర్కొన్నారు.
అలాంటి వస్తువును గతంలో ఎప్పుడూ చూళ్లేదని ఆయన తెలిపారు. దీనిని తన స్నేహితుడు కెమెరాలో బంధించాడని సంగీత కాళాకారుడు మార్క్ ఎమ్మిన్స్ తెలిపాడు. ఆకాశం నిర్మలంగా ఉండడంతో దానిని బాగా చూడగలిగామని ఆయన వెల్లడించారు. ఇది డావ్లిష్ నుంచి తూర్పు దిశగా ప్రయాణించిందని ఆయన వెల్లడించారు. తామిద్దరం ఎగిరే పళ్లాన్ని చూశామని చాలా కచ్చితంగా, నిజాయతీగా చెబుతున్నామని ఇమ్మిన్స్ స్పష్టం చేయడం విశేషం.