: ‘మెగాస్టార్ ని’ ఆ పోజ్ లో కూర్చోబెట్టిన డిజైనర్, దర్శకుడి పాదాలను తాకాలని ఉంది!: దర్శకుడు వర్మ సెటైర్


మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తాజా పోస్టర్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ట్విట్టర్ వేదిక ద్వారా వర్మ స్పందిస్తూ.. మెగాస్టార్ ను ఈ పోజ్ లో కూర్చోబెట్టిన డిజైనర్, దర్శకుడి పాదాలను తాకాలని ఉందని అన్నారు. ఈ పోజ్ కోసం మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు తమ దగ్గర ఉన్న సగం విగ్రహాల్ని అవతల పారేస్తారని, జర్మన్ తత్వవేత్త హెగెల్ కనుక ఇప్పుడు ఉంటే మెగాస్టార్ ను ముద్దాడే వారని వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టర్ డిజైనర్ తో పాటు, మెగాస్టార్ ని ఈ పోజులో కూర్చోడానికి ఒప్పించిన ఇతరుల ఫోను నంబర్లు, చిరునామాలు తనకు కావాలని ఆ ట్వీట్ లో వర్మ కోరారు. 

  • Loading...

More Telugu News