: చిరంజీవి 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వేదిక, ముహూర్తం ఖరారు
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వేదిక, ముహూర్తం ఖారారయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఈ ఫంక్షన్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఫంక్షన్ ను ఇటు హైదరాబాద్ లో కాని, అటు విశాఖపట్నంలో కానీ నిర్వహించకుండా... ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన విజయవాడ స్టేడియంలో నిర్వహించాలని భావించారు.
కాని, మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇవ్వలేదు. స్టేడియంలో ఫంక్షన్ల నిర్వహణకు సంబంధించి కోర్టు షరతులు ఉన్న నేపథ్యంలో, పర్మిషన్ ఇవ్వలేకపోయారు. దీంతో, గుంటూరులోని స్టేడియంలో ఫంక్షన్ నిర్వహించాలనుకున్నారు. అక్కడ కూడా అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో, వేదికను హాయ్ ల్యాండ్ కు మార్చారు నిర్వాహకులు.