: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో లేజర్ గోడలు, స్మార్ట్ సెన్సార్లు
బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అనునిత్యం చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఉదయం భారత్ లోకి ప్రవేశించి, రాత్రి బంగ్లాదేశ్ వెళ్లిపోయే వారు కూడా ఉంటారు. ఈ క్రమంలో, ఎంతోమంది బంగ్లాదేశీయులు చట్ట విరుద్ధంగా భారత్ లో నివసిస్తున్నారు. దీంతో, ఈ చొరబాట్లకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్ గోడలను, స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దులోని నదీతీర ప్రాంతాలలోను, కంచెను నిర్మించలేని ప్రాంతాలలోను ఈ గోడలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించి, వచ్చే ఏడాది నాటికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలను కూడా ఇస్తున్నాయి.