: చిరంజీవి 'ఖైదీ'కి విజయవాడ, గుంటూరుల్లో 'నో పర్మిషన్'.. కుట్ర జరుగుతోందంటున్న మెగా ఫ్యాన్స్!


మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ఫంక్షన్ ను తొలుత విజయవాడ స్టేడియంలో నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి విజయవాడ మునిసిపల్ కమిషనర్ అనుమతి నిరాకరించారు. దీంతో, గుంటూరులోని స్టేడియంలో నిర్వహించాలకున్నారు. కానీ, అక్కడ కూడా చుక్కెదురైంది. దీనిపై చిరు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కుట్ర ప్రకారమే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ఫంక్షన్ జరగకుండా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఫంక్షన్ ను నిర్వహించి తీరాలనే యోచనలో నిర్వాహకులు, అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరపాలనే ఆలోచనలో ఉన్నారు. 

  • Loading...

More Telugu News