: సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను కొమరబండ వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.