: హోంశాఖ వర్గాల్లో కలకలం... హ్యాకింగ్ కు గురయిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌స్ అధికారిక వెబ్‌సైట్


దేశ అంతర్గత భద్రతలో ప్ర‌ధాన‌ పాత్రవహిస్తోన్ననేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గుర‌యింది. దేశంలో ఉగ్రదాడులు జ‌రిగితే ప్రజలను కాపాడే బాధ్యతను ఎన్‌ఎస్‌జీ కమాండోలు స్వీక‌రిస్తార‌న్న విష‌యం తెలిసిందే. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా వీరు భద్రత కల్పిస్తుంటారు. దీంతో వారి వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురికావ‌డం హోంశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది.

‘అలోన్‌ ఇంజెక్టర్‌’ గ్రూప్ పేరుతో వెబ్‌సైట్‌లోకి చొర‌బ‌డిన హ్యాక‌ర్లు సైట్‌లో ఓ అభ్యంతరకర మెసేజ్ పెట్టారు. ఈ రోజు ఉద‌యం ఈ మెసేజ్ క‌న‌ప‌డింది. కశ్మీర్‌లో స‌ర్కారు, ఆర్మీ హింసాకాండ కొన‌సాగిస్తోంద‌ని ఆరోపిస్తూ అందుకు నిరసనగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పోస్టులు చేశారు. త‌మ వెబ్‌సైట్ హ్యాకింగ్ కు గుర‌యింద‌ని తెలుసుకున్న వెంటనే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News