: 2017లో లాంగ్ వీకెండ్స్, ఒక రోజు సెలవు పెట్టుకుంటే నాలుగు రోజుల సెలవులు ఎంజాయ్ చేయచ్చు.. ఆ వివరాలు!


ఈ సంవత్సరంలో చాలా పర్వదినాలు, అధికారిక సెలవులు వారాంతాల్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో లాంగ్ వీకెండ్స్, ఒక రోజు సెలవు పెట్టుకుంటే, నాలుగు వరుస సెలవులు లభించే రోజుల వివరాలివి.
* రిపబ్లిక్ డే గురువారం వచ్చింది. మరుసటి రోజు శుక్రవారం సెలవు పెడితే, ఆపై నాలుగో శనివారం, ఆదివారం సెలవులు ఎంజాయ్ చేయవచ్చు.
* మహాశివరాత్రి శుక్రవారం (ఫిబ్రవరి 24) వచ్చింది. ఆ మరుసటి రోజు నాలుగో శనివారం, ఆపై ఆదివారం కలిసొచ్చింది.
* హోలీ సోమవారం (మార్చి 13) రాగా, పండగ ముందు రెండు రోజులూ సెలవే. సెకండ్ సాటర్ డే, ఆదివారం కలిసి రావడంతో మూడు వరుస సెలవులు లభిస్తాయి.
* శ్రీరామనవమి మంగళవారం (ఏప్రిల్ 4) వచ్చింది. సోమవారం సెలవు పెట్టుకుంటే, మూడు రోజుల సెలవులు అనుభవించవచ్చు.
* అంబేద్కర్ జయంతి శుక్రవారం (ఏప్రిల్ 14) వచ్చింది. శనివారం సెలవు పెడితే, మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభిస్తుంది.
* రంజాన్ (జూన్ 26) పండగకు ముందు ఆదివారం వచ్చింది. జూన్ 24న నాలుగో శనివారం కావడంతో మూడు వరుస సెలవులు రానున్నాయి.
* స్వాతంత్ర్య దినోత్సవం మంగళవారం వచ్చింది. సోమవారం సెలవు పెట్టగలిగితే, రెండో శనివారం కలిపి నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చు.
* వినాయక చవితి శుక్రవారం (ఆగస్టు 25) వచ్చింది. శనివారం సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ మీ ముందున్నట్టే.
* క్రిస్మస్ సోమవారం వచ్చింది. దాని ముందు సెకండ్ సాటర్ డే, సండే ఉన్నాయి.

  • Loading...

More Telugu News