: అర్ధరాత్రి కాదు... ఉదయం 7 గంటలకు రోడ్డెక్కి కేరింతలు కొడుతున్న బెజవాడ యువత
కొత్త సంవత్సరం శుభవేళ రాత్రి 12 గంటలకు ఆనందంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ రోడ్లపై ఆనందంగా గడిపే యువత గురించి అందరికీ తెలిసిందే. దీనికి అదనంగా విజయవాడ యువత ఈ ఉదయాన్నే మరోసారి రోడ్డెక్కి కేరింతలు కొడుతోంది. బందరు రోడ్డులో ఉదయం 7 గంటల నుంచి 'హ్యాపీ సండే' వేడుకగా సాగుతోంది. కొత్త సంవత్సరంలో తొలి హ్యాపీ సండే కావడంతో, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువతీ యువకులు హాజరై, ఒకరికొకరు 'విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్' చెప్పుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. రహదారిపై ఏర్పాటు చేసిన వేదికలపై పలు తెలుగు, హిందీ చిత్ర గీతాలకు యువత చేస్తున్న నృత్యాలు అందరినీ అలరిస్తున్నాయి. రహదారిపై ఆటపాటలతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది.