: మారిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు


దాదాపు 13 లక్షల మంది సైనికులతో ఉన్న భారత సైన్యానికి 27వ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, వాయుసేనకు 25వ చీఫ్ గా ఎయిర్ మార్షల్ విరేందర్ సింగ్ ధనోవా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీకి 42 సంవత్సరాల పాటు సేవలందించిన జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ రిటైర్ మెంట్ తరువాత ఆయన స్థానంలో బిపిన్ రావత్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇక అనూప్ రాహా స్థానంలో ధనోవాను గత నెలలో మోదీ సర్కారు నియమించింది. కాగా, తనకన్నా సీనియారిటీ పరంగా ముందున్న పీఎం హరీజ్, ప్రవీన్ బక్షిలను కాదని ఆర్మీ చీఫ్ పదవి రావత్ ను వరించిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్మీ చీఫ్ కు తమ పూర్తి సహాయాన్ని అందిస్తామని కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న ఈస్ట్రన్ కమాండ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ బక్షి వెల్లడించారు. బిపిన్ రావత్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News