: మోదీ ప్రసంగం ప్రజల్లో ఉత్సాహం నింపింది.. కొత్త నిర్ణయాలు భేష్!: వెంకయ్యనాయుడు
ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ ప్రధాని ప్రకటించిన నిర్ణయాలు ఎంతో గొప్పవని అన్నారు. నోట్లమార్పిడి కార్యక్రమం ద్వారా ప్రజలకు కొంతమేర ఇబ్బందులు ఏర్పడ్డాయని, అయినప్పటికీ వారు ప్రదర్శించిన ఓపిక, చిత్తశుద్ధికి మోదీ జేజేలు పలికారని ఆయన చెప్పారు. నల్లధనంపైనా, అవినీతిపైనా ప్రధాని చేపట్టిన పోరాటం మరింత ఉద్ధృతంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. మరిన్ని పాలనా సంస్కరణలు చేపట్టాలని కేంద్రం భావిస్తోందని ఆయన తెలిపారు.