: నేను బహిష్కరణకు గురైంది పార్టీ నుంచే కానీ, కుటుంబం నుంచి కాదు!: అఖిలేశ్ యాదవ్
తాను ఇప్పటికీ తన తండ్రితోనే ఉన్నానని సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత నేత, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీలో రాజకీయ సంక్షోభం తార స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈరోజు తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. తాను బహిష్కరణకు గురైంది పార్టీ నుంచే కానీ, తన కుటుంబం నుంచి కాదని అన్నారు. వచ్చే అసెంబ్లీలో పార్టీని గెలిపించి, తన తండ్రికి బహుమతిగా ఇస్తానని అన్నారు. అనంతరం, తన తండ్రి ఆశీర్వాదం కోసం ఆయన నివాసానికి అఖిలేశ్ బయలుదేరి వెళ్లారు. తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాను అఖిలేశ్ అక్కడికి తీసుకువెళ్లినట్లు సమాచారం.