: ‘పట్టిసీమ’ పూర్తి చేయకపోతే ఈ అటుకులు కూడా మీరు ఇచ్చేవారు కాదు: దివిసీమ రైతులతో చంద్రబాబు


‘పట్టిసీమ’ పూర్తి చేయకపోతే ఈ అటుకులు కూడా ఇచ్చేవారు కాదని తనను కలిసిన దివిసీమ రైతులతో సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో దివిసీమ రైతులు ర్యాలీగా వచ్చి సచివాలయంలో చంద్రబాబును కలిశారు. తొలి ధాన్యంతో పాటు పొంగలి, అటుకులు, జున్ను కూడా చంద్రబాబుకు రైతులు ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి తమ పంటలను కాపాడారని రైతులు సంతోషం వ్యక్తం చేసిస సందర్భంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా డెల్టాను ఆదుకోవాలని ‘పట్టిసీమ’ను నిర్మించామని, 2018 నాటికి గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు రావాలని, 25 శాతం తక్కువ వర్షపాతం ఉన్నా పట్టిసీమ నీటితో పంటలు పండించారని అన్నారు.  ఏ వ్యక్తి సాయం చేసినా కృతజ్ఞతగా ఉండటమనేది ముఖ్యమని, రాష్ట్రంలో ఎవరు మంచి పని చేసినా ప్రజలు అభినందించాలని, 'రోజూ భోజనం చేసేటప్పుడు ఒక్కసారి గోదావరి మాతను ప్రార్థించండి' అంటూ రైతులకు చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News