: మరింతగా పెరగనున్న నౌకాదళ సామర్థ్యం... ఈ సంవత్సరంలో 100 యుద్ధనౌకలు


కొత్త సంవత్సరంలో భారత నౌకాదళానికి 100 యుద్ధ నౌకలను డెలివరీ చేయనున్నట్టు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) ప్రకటించనుంది. నౌకాదళ సామర్థ్యాన్ని మరింతగా పెంచేలా ఇవి ఉంటాయని జీఆర్ఎస్ఈ చైర్మన్, రిటైర్డ్ అడ్మిరల్ ఏకే వర్మ మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య వీటి డెలివరీ ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాయిచాక్ ప్రాంతంలో సబ్ మెరైన్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం సముద్ర తీరంలో ఎక్కువ స్థలం కావాల్సి వుంటుందని తెలిపారు.

కాగా, గడచిన ఐదేళ్లలో 15 యుద్ధ నౌకలను, 18 నౌకలను జీఆర్ఎస్ఈ డెలివరీ చేసింది. షిప్ యార్డులో ఆధునికీకరణ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిన అనంతరం, ఒకేసారి 14 షిప్ లను తయారు చేయవచ్చని ఆయన అన్నారు. భారత నావీకి అడ్వాన్డ్స్ స్టెల్త్ ప్రాజెక్ట్ పీ-17ఎ కింద నౌకా నిర్మాణ ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తమ వద్ద రూ. 30 వేల కోట్ల విలువైన ఆర్డర్లున్నాయని పేర్కొన్నారు. కాగా, 2014లో తొలి యుద్ధ నౌకను ఇండియాలో తయారు చేసి మారిషస్ కు ఎగుమతి చేయడం ద్వారా జీఆర్ఎస్ఈ వార్తల్లో నిలిచింది. ఈ సంస్థ నిర్మించిన ఐఎన్ఎస్ కామోర్తా, ఐఎన్ఎస్ కద్మాత్ యాంటీ సబ్ మెరైన్ నౌకలు ప్రస్తుతం నౌకాదళానికి సేవలందిస్తున్నాయి.

  • Loading...

More Telugu News