: అండర్ వేర్ లో కిలోన్నర బంగారం!


అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇది జరిగింది. జెడ్డా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా ఈ బంగారం పట్టుబడింది. వీరంతా తమ అండర్ వేర్లలో బంగారాన్ని దాచుకుని వస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. ఇటీవల కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున బంగారం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారు వివిధ పద్ధతుల్లో బంగారాన్ని తీసుకురావడానికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలో, వారంతా కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు.

  • Loading...

More Telugu News