: జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరారీ... మరణశిక్ష పడ్డ ఖైదీ కూడా!


బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. అనారోగ్యంగా ఉందన్న కారణంతో వీరంతా... జైల్లోని హాస్పిటల్ వార్డులో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. వార్డులో ఉన్న టాయ్ లెట్ విండోను బద్దలుకొట్టి వీరు పరారైనట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. పరారైన ఐదుగురు ఖైదీలలో ఒక వ్యక్తికి మరణ శిక్ష కూడా పడింది. మిగిలిన నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


  • Loading...

More Telugu News