: 'రింగింగ్ బెల్స్' టు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... టాప్-10 స్టోరీస్


కాలగతిలో మరో ఏడాది గడిచిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో మధుర స్మృతులు, కొన్ని కష్టాలు, మరికొన్ని సుఖాలను మనకందించి వెళ్లిపోయింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సమయాన, గడచిన ఏడాదిలో అత్యధికులు చదివిన, తెలుసుకున్న వార్తల వివరాలివే.
* రూ. 251కే స్మార్ట్ ఫోన్: రింగింగ్ బెల్స్ సంస్థ రూ. 251కే అన్ని ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పిన వార్త ఈ సంవత్సరం టాప్ న్యూస్ స్టోరీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్, ఆపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింది.
* ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలిచిన సింధూ: తెలుగుతేజం పీవీ సింధు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన వార్త టాప్-2గా ఉంది.
* పెద్ద నోట్ల రద్దు: దేశంలోని నల్లధనాన్ని అరికట్టడానికంటూ నరేంద్ర మోదీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ చేసిన ప్రకటన తరువాతి స్థానంలో ఉంది.
* రిలయన్స్ జియో ఉచిత ఆఫర్: ప్రపంచ టెలికం సంస్థలు విస్తుపోయేలా ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్ చేస్తూ, రిలయన్స్ జియో చేసిన ప్రకటన అత్యధికులు చదివి తెలుసుకున్న వార్తల్లో నాలుగో స్థానంలో నిలిచింది.
* కొత్త కరెన్సీ ఎలా ఉంటుంది?: నోట్ల రద్దు తరువాత రూ. 2 వేలు, రూ. 500 నోట్లను ప్రభుత్వం విడుదల చేయగా, ఈ నోట్లు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు దేశ ప్రజలు పెద్దఎత్తున ఆసక్తి చూపారు.
* అమ్మ మరణం: తమిళనాడు రాష్ట్ర ప్రజలను అనాధలుగా చేస్తూ, ముఖ్యమంత్రి జయలలిత లోకాన్ని వీడటం ఈ సంవత్సరంలో అత్యధికులు తెలుసుకున్న ఆరవ అతిపెద్ద వార్తగా నిలిచింది.
* శశికళా నటరాజన్: ఆ తరువాతి వార్తలో నిలిచింది జయలలిత స్నేహితురాలు శశికళే. జయ మృతి తరువాత, శశికళ నడిపిన రాజకీయాలు, తమిళనాట మారుతున్న పరిస్థితులను తెలుసుకునేందుకు అత్యధికులు ఆసక్తి చూపారు.
* సత్తా చాటిన మహిళాలోకం: ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ఫలితాల వార్త టాప్-8లో నిలిచింది. పశ్చిమ బెంగాల్ లో అటు మమతా బెనర్జీ, తమిళనాట ఇటు జయలలిత అనూహ్య రీతిలో తమ అధికారాన్ని నిలుపుకున్నారు.
* పాక్ పై లక్షిత దాడులు: ఉరి ఉగ్రదాడి తరువాత, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ నిర్వహించిన లక్షిత దాడుల గురించిన వార్త టాప్-9గా ఉంది.
* పతకం రాకున్న భారత బెస్ట్ జిమ్నాస్ట్: జిమ్నాస్ట్ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన 'ప్రొడునోవా'ను ప్రదర్శించడం ద్వారా భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అందరి మన్ననలూ అందుకుంది. పతకాన్ని తేలేకున్నా, భారత అత్యుత్తమ జిమ్నాస్ట్ గా నిలిచింది. ఈ వార్త అత్యధికులు తెలుసుకున్న వార్తల్లో పదవ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News