: పార్టీని భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కొత్త సీఎం ఎవరో రేపు చెబుతాం!: ములాయం సింగ్ యాదవ్
సమాజ్ వాదీ పార్టీలో ముఖ్యమంత్రి అయినా, సాధారణ కార్యకర్త అయినా ఒకటేనని, పార్టీకి నష్టం కలిగించే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా సహించబోనని పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. నిన్న అనూహ్య పరిస్థితుల్లో తన కుమారుడు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను, తన సోదరుడు రాంగోపాల్ యాదవ్ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీని భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన, 1వ తేదీన పార్టీ అత్యవసర సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ప్రకటిస్తామని, ఆ వెంటనే ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులతో నేడు ములాయం, అఖిలేష్ లు వేరువేరుగా సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అనుయాయులతో సమావేశం అనంతరం అఖిలేష్ తన భవిష్యత్ అడుగుల గురించి వెల్లడించవచ్చని సమాచారం.