: సల్మాన్ బర్త్ డేకు ‘పాక్’ అభిమాని స్పెషల్ గిఫ్ట్ !


బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఈ నెల 27న తన 51వ బర్త్ డే వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. సల్మాన్ కు వీరాభిమాని అయిన అలీ మాలిక్ అనే పాకిస్తానీ, తన సూపర్ స్టార్ కోసం వినూత్నమైన కానుక ఒకటి కొనుగోలు చేశాడు. సల్మాన్ పుట్టినరోజు తేదీ, నెల వచ్చేలా ‘27/12’తో దుబాయ్ నంబర్ ప్లేట్ ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం, మన కరెన్సీలో సుమారు రెండు లక్షల పదివేల రూపాయలు ఖర్చుపెట్టాడు. ‘ఎస్’ సిరీస్ లో ఈ నంబర్ ప్లేట్ కొన్నాడు. ఈ నంబర్ ప్లేట్ ను సల్మాన్ కు బహుమతిగా ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో దీనిని వేలం వేయాలని, వచ్చిన విరాళాన్ని దుబాయ్ కేర్స్ అండ్ బీయింగ్ హ్యూమన్, ఖాన్స్ చారిటీ సంస్థకు వినియోగించుకోవాలని అలీ మాలిక్ కోరనున్నట్లు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News