: సంక్రాంతికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదు: ఏపీ రవాణా మంత్రి


పండగలకు తమ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటం తెలిసిందే. అయితే, సంక్రాంతి పండగకు మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఏపీ రవాణా మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేటు ట్రావెల్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విజయవాడలో రవాణాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శిద్దా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ,  రవాణా శాఖలో అవినీతిని సహించేది లేదని, ఈ ఏడాది అనుకున్న లక్ష్యం మేరకు ఆదాయం సాధించలేకపోయామని, రాబోయే మూడు నెలల్లో తనిఖీలు పెంచాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.
 
 

  • Loading...

More Telugu News