: అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం కేసులో.. త్యాగి బెయిల్ పై సీబీఐ అభ్యంతరం
అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం కేసులో బెయిల్ పై విడుదలైన భారత వాయుసేన మాజీ చీఫ్ త్యాగికి ప్రత్యేక కోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. త్యాగి బెయిల్ కు అభ్యంతరం చెబుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ప్రత్యేక కోర్టు... త్యాగి సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. త్యాగి బెయిల్ పై బయట ఉంటే తమ విచారణకు ఆటంకం కలుగుతుందని తన పిటిషన్ లో సీబీఐ పేర్కొంది. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్ 9న త్యాగి అరెస్ట్ కాగా... డిసెంబర్ 26న ఆయనకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.