: 2015లో జాక్ మా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇఫ్పుడు వైరల్ అవుతోంది
2015లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు జాక్ మా ఇచ్చిన ఇంటర్ల్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనాటి తన ప్రసంగంలో వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను, తానెదుర్కొన్న కష్టాలను జాక్ మా వెల్లడించారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే... ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న తనను హార్వార్డ్ యూనివర్సిటీ పది సార్లు తిరస్కరించిందని అన్నారు. చైనాలో కేఎఫ్సీ రంగప్రవేశం చేసిిన తొలినాళ్లలో అందులో ఉద్యోగం కోసం 24 మంది దరఖాస్తు చేసుకుంటే 23 మందిని ఎంపిక చేశారని, ఆ ఎంపిక కాని ఏకైక వ్యక్తి తానేనని వెల్లడించారు.
దీంతో తీవ్ర అసహనం వచ్చేదని, ప్రపంచాన్ని మార్చాలని అనిపించేదని అన్నారు. అయితే అంతకంటే ముందు మారాల్సింది తానేనని గుర్తుచేసుకున్నానని ఆయన చెప్పారు. దీంతో అలీబాబా ప్రారంభించి, తన సంస్థలో 47 శాతం మంది మహిళలకు స్థానం కల్పించానని ఆయన చెప్పారు. అదే తన విజయరహస్యమని ఆయన పేర్కొన్నారు. 'ఈ రోజు నీ దగ్గర కొన్ని వందల మిలియన్ల సంపద ఉండి ఉండొచ్చు...కానీ ఆ సంపదను ఇచ్చింది ఈ సమాజమేనన్న కృతజ్ఞత ఉండాలి' అని ఆయన సూచించారు. ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 17 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.