: భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు!


కట్టుకున్న భార్య కాపురానికి రాలేదనే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్టులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.... శంకర్ (35) రోజువారీ కూలీగా పని చేస్తూ భార్యా, కూతురుని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలంటూ భార్యను ఎన్నోసార్లు కోరాడు శంకర్. అయినా, ఆమె రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన శంకర్... ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

  • Loading...

More Telugu News