: యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ లోని హోంగార్డు డిపార్ట్ మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి సంజీవ్ దూబే ఈరోజు సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. 1987 బ్యాచ్ కు చెందిన దూబే లక్నోలోని గౌతంపల్లిలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ కేడర్ కు చెందిన సంజీవ్ దూబే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.