: బ్యాంకాక్‌లో పేలుళ్లంటూ ఫేస్‌బుక్ లో తప్పుడు అలెర్ట్.. తర్వాత పొరపాటు అంటూ వివరణ!
బ్యాంకాక్‌లో బుధవారం పేలుళ్లు సంభవించాయంటూ ఫేస్‌బుక్ నుంచి తప్పుడు అలెర్ట్ రావడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. బాణసంచా పేలుళ్లలను బాంబు పేలుళ్లుగా భ్రమపడిన ఫేస్‌బుక్ సేఫ్టీ చెక్ ఫీచర్ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకంగా ఓ పేజీని కూడా ప్రారంభించింది. అయితే తర్వాత అది అంతా ఉత్తిదేనని తెలుసుకున్న ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. బుధవారం కొందరు ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయంపైకి బాణసంచా కాల్చారు. దీనిని పొరపాటున బాంబుపేలుళ్లగా భావించిన ఫేస్‌బుక్ వెంటనే అలెర్ట్ జారీ చేసింది. దీనిని చాలామంది నెటిజన్లు షేర్ కూడా చేసుకున్నారు. అయితే థర్డ్‌పార్టీ ఇచ్చిన సమాచారంతోనే ఈ పొరపాటు జరిగిందని ఆ తర్వాత ఫేస్‌బుక్ వివరణ ఇచ్చి దానిని తొలగించింది.