: కడపలో జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి దుర్మరణం
కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన బస్సు గొర్రెలమందపైకి దూసుకుపోయింది. పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 250 గొర్రెలు మృతి చెందాయి. మృతులు తొండూరు మండలం కోరవానిపల్లె గ్రామస్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.