: ‘జియో’ సిమ్ ను ఇంటికే పంపనున్న ‘స్నాప్ డీల్’
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ‘స్నాప్ డీల్’ వెల్ కమ్ పేరిట ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టనుంది. ఈ ఆఫర్ అధికారికంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఆఫర్ ద్వారా రిలయన్స్ సంస్థ ‘జియో’ సిమ్ ను వినియోగదారుల ఇళ్లకే ఉచితంగా పంపనుంది. అంతేకాదు, సిమ్ యాక్టివేషన్ ప్రక్రియను కూడా వారే పూర్తి చేయనున్నారు. ఇందుకుగాను, ముందుగా తమ పూర్తి చిరునామాను ‘స్నాప్ డీల్’లో పొందుపరచాలి. జియో సిమ్ ను డెలివరీ చేసే సమయంలో సంబంధిత ఆధార్ కార్డు వివరాలను సంస్థ ప్రతినిధికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. తమ పూర్తి అడ్రస్ ను ఇప్పటికే పొందుపరచిన వినియోగదారులకు ‘స్నాప్ డీల్’ ఈ-మెయిల్స్ పంపిస్తోంది. ఈ ఆఫర్ అధికారికంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.