: విశాఖ ప్రతిష్టను పెంచేలా ‘ఉత్సవ్’ నిర్వహిస్తాం: మంత్రి గంటా


విశాఖపట్టణం ప్రతిష్టను పెంచేలా ‘విశాఖ ఉత్సవ్’ నిర్వహిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి 28న ప్రారంభమయ్యే ‘విశాఖ ఉత్సవ్’ను, మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాదిలా వేర్వేరు ప్రదేశాల్లో కాకుండా ఒకేచోట ఉత్సవాలకు ఏర్పాట్లు చేశామన్నారు. బీచ్ లో 2.5 కిలోమీటర్ల పొడవున ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News