: కనగానెపల్లె ఎంపీపీ ఎన్నిక రద్దు చేయాలని ఈసీని కోరిన వైఎస్సార్సీపీ
అనంతపురం జిల్లాలోని కనగానెపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. కనగానెపల్లె ఎంపీపీ ఎన్నికల సమయంలో మంత్రి పరిటాల సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాసిన ఒక లేఖను ఎన్నికల కమిషనర్ కు ఆ పార్టీ నేత చల్లా మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఎన్నికల సమయంలో వీడియో ఫుటేజ్ పరిశీలించాలని, ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. కాగా, ఈ విజ్ఞప్తికి స్పందించిన ఈసీ, దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని అనంతపురం కలెక్టర్ ను ఆదేశించారు.