: ఇక పాక్ పోస్టులే లక్ష్యంగా దాడులు చేయాల్సిందే!: రక్షణ శాఖ నిపుణుల సూచన
సరిహద్దుల్లో నిత్యమూ పాకిస్థాన్ వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్న వేళ, పాక్ సైన్యం పోస్టులే లక్ష్యంగా భారత సైన్యం దాడులు చేయాల్సిందేనని రక్షణ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. భారత సైన్యం దాడులు జరపకుంటే, పాక్ ప్రభుత్వానికి బుద్ధి రాదని రక్షణ రంగ నిపుణుడు, మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్ఆర్ సిన్హో వ్యాఖ్యానించారు. పాక్ లో కొత్త ఆర్మీ చీఫ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాల్పులు తగ్గుతాయని భారత్ భావించిందని, అయితే, అది జరగ లేదని, కొత్త ఆర్మీ చీఫ్ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మరింత నియంత్రణలో ఉంచేంత శక్తిమంతమైన వ్యక్తని, ఆయనేం చేయాలనుకుంటే అంత చేసేయగలడని అభిప్రాయపడ్డారు. పాక్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటున్నదని ఆశించడం తప్పని, సరిహద్దుల్లో కాల్పులు తిరిగి మొదలయ్యాయని, వీటిని నిలువరించాలంటే, భారత సైన్యం దీటుగా స్పందించాలని ఆయన సలహా ఇచ్చారు.