: మగవాడిపై ఆధారపడి మహిళలు బతికే రోజులు పోయాయి!: ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో అడుగుపెట్టి 'క్వాంటికో' సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయింది ప్రియాంకా చోప్రా. 'బేవాచ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడానికి రెడీ అయింది. తాజాగా, అసోం టూరిజం ప్రచారకర్తగా కూడా ప్రియాంక నియమితురాలైంది. ఈ క్రమంలో, ఫెమినిజం గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పిన ప్రియాంక... మగవాడిపై ఆధారపడి మహిళలు బతికే రోజులు పోయాయని చెప్పింది. కేవలం శృంగార అవసరాలను తీర్చుకోవడానికే ఆడవారికి మగవారితో అవసరం ఉందని తెలిపింది.