: పదేపదే అడిగినా, ఆ తీపి కబురేంటో చెప్పని వెంకయ్యనాయుడు!


"మరో రెండు రోజుల్లో ఓ తీపి కబురును వింటారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఏమిటనేది నేను చెప్పకూడదు. ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించే కబురు అది" అంటూ, నిన్న నెల్లూరులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినప్పటి నుంచి అది ఏమై ఉంటుందా? అన్న విషయమై నెటిజన్ల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆదాయపు పన్ను పరిమితిని రూ. 4 లక్షలు లేదా రూ. 5 లక్షలకు వరకూ పెంచుతూ బడ్జెట్ కన్నా ముందుగానే నిర్ణయం వెలువడవచ్చనేది అత్యధికులు ఊహిస్తున్న అంశం.

ఇక పన్ను వసూలు విధానాన్ని పూర్తిగా తొలగించి, డిజిటల్ లావాదేవీలపై మాత్రమే పన్ను విధించవచ్చని కొందరు, ఆ కబురు అసలు కరెన్సీకి సంబంధించినదే అయి వుండదని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు, దొరికిన నల్ల డబ్బును దేశ ప్రజలందరికీ పంచుతారేమోనంటూ జోకులు కూడా పేలుస్తున్నారు. ఇక నిన్న నెల్లూరులో మీడియా ఈ తీపి కబురు ఏంటని వెంకయ్యనాయుడిని పదేపదే ప్రశ్నించినా, ఆయన్నుంచి చిరునవ్వే సమాధానమైంది. అదేంటో తాను చెప్పనని, తనను అడగవద్దని చెబుతూ, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News