: రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రణబ్ నోటినీ ఊరించిన గవర్నర్ 'ఎట్ హోం' డిన్నర్ వంటకాలు!
నిన్న రాత్రి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్ లను ఏర్పాటు చేయగా, వారు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. గవర్నర్ స్వయంగా ఎంపిక చేసిన వంటకాలను ఇక్కడ సిద్ధం చేశారు. వీటిని రుచిచూసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ సహా పలువురు వీఐపీలు, వంటకాలు బాగున్నాయని కితాబిచ్చినట్టు సమాచారం.
వాటిల్లో గోంగూర పచ్చడి, గ్రీన్ సలాడ్, చెర్రీ టమాటో, గ్రిల్డ్ వెజిటబుల్స్ సలాడ్, వంకాయ - టమాటో పచ్చడి, పాపడ్, రైతా, యోగార్ట్, సబ్జ్ బాదామీ షోర్బా, అచారీ పనీర్, భట్టి కా ఆలూ, వెజిటబుల్ శికంపూర్ కబాబ్, హైదరాబాద్ సబ్జ్ బిర్యానీ, పనీర్ ఖత్తా ప్యాజ్, నిజామీ హండీ, లసూనీ చిరోంజి పాలక్, ఆలూ కట్లియాని, ఖట్టి దాల్, మిర్చీ కా సాలన్ వంటి ఉత్తరాది, దక్షిణాది వంటకాలను అతిథులకు వడ్డించారు.