: ఏపీ ఖజానాకు చేరిన ‘పోలవరం’ తొలివిడత రుణం
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాబార్డు నుంచి అందిన తొలివిడత రుణం రూ.1981 కోట్లు ఈరోజు ఏపీ ఖజానాకు చేరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటన చేశారు. ఈ సొమ్మును ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ ఖజానాకు బదలాయించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రుణ ప్రక్రియ ప్రారంభమైనందున ఇక నిధుల కొరత ఉండబోదని అన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన చెక్కును నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులు చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అందుకున్నారు.